![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -587 లో.....సీతారామయ్య హాస్పిటల్ లో ఉండగా రాహుల్, రుద్రాణి తమకేం పట్టనట్లే ఉంటారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి ఏమైందంటూ అడుగుతాడు. ఆ తర్వాత డాక్టర్ వచ్చి.. తన కండిషన్ బాగోలేదు.. అయన కోమాలోకి వెళ్ళిపోయాడనగానే అందరు షాక్ అవుతారు. పేషెంట్ ని అబ్జర్వేషన్ లో ఉంచాం.. ఎప్పుడైన రావచ్చు.. రోజులు పట్టొచ్చు.. నెలలు పట్టొచ్చు.. సంవత్సరాలు పట్టొచ్చని డాక్టర్ చెప్తాడు. ఇంతమంది ఇక్కడ ఎందుకు మీరు వెళ్ళండి నేనే ఉంటానని కళ్యాణ్ అనగానే ఇందిరాదేవి రానని అంటుంది. కానీ అందరు కలిసి బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తారు.
మరొకవైపు సీతారామయ్య గురించి తెలిసి కనకం బాధపడుతుంటే.. అప్పుడే కృష్ణమూర్తి వస్తాడు. జరిగింది చెప్పడంతో తను షాక్ అవుతాడు. ఆ తర్వాత ఇందిరాదేవి సీతారామయ్య ఫొటో పట్టుకొని బాధపడుతుంటే.. కావ్య వచ్చి దైర్యం చెప్పి భోజనానికి తీసుకొని వెళ్తుంది. అందరు భోజనం చేస్తుండగా.. ఇక ధాన్యలక్ష్మికి న్యాయం జరగదా అని రుద్రాణి అనగానే.. అందరు రుద్రాణిపై విరుచుకుపడతారు. నా గురించి ఎవరు ఆలోచించడం లేదని ధాన్యలక్ష్మి అనగానే.. కావ్య కోప్పడుతుంది.
ఈ సిచువేషన్ లో కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారని కావ్య అనగానే.. నీకేం సంబంధమని మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. తను ఈ ఇంటికి పెద్ద కోడలు అని అపర్ణ అంటుంది. ధాన్యలక్ష్మి అలా మాట్లాడడంతో అసలు మీ సమస్య ఏంటి అంటూ ఇందిరాదేవి వాళ్లపై అరుస్తుంది. తరువాయి భాగంలో నా వాటా నాకు కావాలని ధాన్యలక్ష్మి అనగానే.. ఈ గొడవ ఏంటి రేపు ఎవరి వాటా వాళ్ళకి రాసేస్తానని సుభాష్ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |